Hyderabad, జూలై 27 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికొచ్చిన కూతురుని తిట్టి పంపించేస్తుంది అపర్ణ. దాంతో రేవతి ఏడుస్తూ వెళ్లిపోతుంది. రాజ్, కావ్య ఇలాంటి ప్లాన్ వేసినందుకు ఇందిరాదేవి తిడుతుంది. దాంతో చాలా రోజుల తర్వాత చూస్తే కలిసిపోతుందనుకుంటే ఇలా అవుతుందని అనుకోలేదని కావ్య అంటుంది.

ఇక నాకు ఏమాత్రం ఆశలు లేవు. మా అమ్మ నన్ను క్షమిస్తుందని, నా కొడుకును ఆడిస్తుందని ఏమాత్రం నమ్మకం లేదని రేవతి అంటుంది. ఆశపడితేనే జీవితం. మీ అమ్మ గారు క్షమిస్తారని ఎక్కడో ఓ చోట నమ్మేగా వచ్చారు. రేపు ఓ రోజు కచ్చితంగా మిమ్మల్ని క్షమించి దగ్గరికి తీసుకుంటారు. కానీ, అది జరిగే వరకు ఎదురుచూడాలి అని కావ్య అంటుంది.

అంత ఎదురుచూసే ఓపిక నాకు లేదు. కాబట్టి త్వరగా ఆ పని అయ్యేలా చేద్దామని రాజ్ అంటాడు. అర్థం కానట్లు అంతా మొహాలు పెడతారు. కూ...