భారతదేశం, నవంబర్ 9 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో తన కొడుకును తానే కాపాకుంటానని కుయిలి భర్త రంజిత్ దగ్గరికి వెళ్లిపోతుంది రుద్రాణి. రాజ్, కావ్య ఎంత చెప్పిన వినదు. రాహుల్ కోసం అత్త ఏమైనా చేస్తుంది. ఇలాంటప్పుడు అత్తతో నువ్వు పక్కన ఉండి, ఎలాంటి తప్పు జరగకుండా చూడమని స్వప్నకు చెబుతాడు రాజ్.

దాంతో స్వప్న కూడా రుద్రాణితోపాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. ఇప్పుడు రాహుల్‌ను నిర్దోషి అని నిరూపించే సాక్ష్యం ఏముందిరా అని సుభాష్, అపర్ణ వాళ్లు అడుగుతారు. కుయిలి ఇంటికి వెళ్లినరోజే అక్కడ సీక్రెట్ కెమెరా ఒకటి కళావతి పెట్టిందని రాజ్ చెబుతాడు.

మేము వెళ్లి ఎలాంటి నిజాలు రాబట్టలేకపోతే వాళ్లు ఆడే నాటకం రికార్డ్ అవుతుందని ముందుగానే సీక్రెట్ కెమెరా పెట్టినట్లు కావ్య చెబుతుంది. దాంతో కావ్యను ఇంటిల్లిపాది మెచ్చుకుంటారు. ఆ సీక్రెట్ కెమెరాను రి...