Hyderabad, ఆగస్టు 10 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసుకుందామని హాస్పిటల్‌కు వెళ్తున్నట్లు అపర్ణకు చెబుతుంది కావ్య. అదే సమయంలో రాజ్ కావ్య ఇంటికి వస్తుంటాడు. ఇంటి నుంచి కావ్య వెళ్లిపోవడం చూసిన రాజ్ ఆఫీస్‌కు వెళ్తుందేమో అనుకుని ఫాలో అవుతుంటాడు.

అయితే, దారిలో కావ్య ఆఫీస్‌కు వెళ్లకుండా వేరే రూట్ తీసుకోవడంతో షాక్ అయిన రాజ్ కళావతి గారు ఎక్కడికి వెళ్తున్నారు అని మరింత క్యూరియాసిటీగా ఫాలో అవుతాడు. తీరా కావ్య హాస్పిటల్‌కు వెళ్లేసరికి మళ్లీ షాక్ అవుతాడు రాజ్. కావ్య రిసెప్షన్‌లో అడిగి డాక్టర్‌ను వెళ్లి కలుస్తుంది. డాక్టర్ కావ్యను చెక్ చేసి మీరు కంగారు పడాల్సిందేమి లేదు. బిడ్డ హెల్తీగా ఉంది అని చెబుతుంది.

డాక్టర్ మాటలు విన్న రాజ్‌కు మైండ్ బ్లాక్ అవుతుంది. మళ్లీ వాళ్ల మాటలు స్పష్టంగా వెంటాడు. బిడ్డ గురించి, త...