Hyderabad, సెప్టెంబర్ 28 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో అబార్షన్ చేయకుంటే కావ్య చనిపోతుందన్న నిజాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పినట్లుగా కల కంటాడు రాజ్. నిజం చెబితే కావ్య ఒప్పుకోదని, తనకు ఏమైనా జరుగుతుందనే రాజ్ భయపడతాడు. మరోవైపు అంతా రాజ్‌ను నిందిస్తుంటారు.

కావ్యను ఎందుకు అబార్షన్ చేసుకోమంటున్నావని, పిల్లల సంగతి తాము చూసుకుంటామని, ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నావని అపర్ణ, సుభాష్, ధాన్యలక్ష్మీ నానా మాటలు అంటారు. ఇదే సమయం అనుకుని రాజ్‌ను నెగెటివ్ చేసి తాను మంచి పేరు తెచ్చుకోవాలని రాహుల్ కూడా డ్రామా చేస్తాడు.

నువ్వు కావ్యకు క్షమాపణలు చెప్పాలి. బిడ్డ ప్రాణం తీసే హక్కు మనకు లేదు అంటూ డైలాగ్స్ కొడతాడు రాహుల్. నేనేమైనా సమస్యల్లో ఉన్నానని చెప్పానా నీకు. నేను ఏం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉందని రాహుల్‌కు కౌంటర్ ఇస్తాడు రాజ్. ఏది ఏమైన...