Hyderabad, ఆగస్టు 3 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో ఇకనైన కష్టాలు దూరం చేసి తన భర్తకు దగ్గర చేయమని, నీ లీలలు ఆపేయమని కృష్ణుడితో మోర పెట్టుకుంటుంది కావ్య. ఇంతలోనే కావ్యకు వాంతులు అవుతాయి. నెల తప్పినట్లు అనుమానం వచ్చిన కావ్య ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో పరీక్ష చేసుకుంటుంది.

దాంట్లో కావ్య ప్రెగ్నెంట్ అయినట్లు కన్ఫర్మ్ అవుతుంది. అది తెలిసి తెగ సంబరపడిపోయిన కావ్య ఆ విషయం అత్త అపర్ణకు చెప్పాలని పిలుస్తుంది. కానీ, ఒక్కసారిగా ఆగిపోయి తెగ బాధపడిపోతుంది. తన భర్త రాజ్‌కు గతం గుర్తు లేక రామ్‌గా మారిపోవడం, రామ్‌ ప్రేమను ఒప్పుకుని పెళ్లి చేసుకొందామన్న కావ్యకు ఈ ప్రెగ్నెన్సీ శాపంగా అడ్డంకిగా మారిందని తెలిసి ఏడుస్తుంది.

ఇంతలో అక్కడికి అప్పు వస్తుంది. అప్పును చూసి తనను హగ్ చేసుకుని ఏడుస్తుంటుంది కావ్య. ఏమైంది అక్క, ఎందుకు ఏడుస్తున్నావ్...