భారతదేశం, అక్టోబర్ 26 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో కావ్య కళ్లు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ కొన్ని టెస్టులు చేస్తానంటుంది. కావ్యకు స్పృహ వచ్చేలోపే అబార్షన్ చేయించాయలని ఇందిరాదేవి ఐడియా ఇస్తుంది. కానీ, దానికి రుద్రాణి అడ్డు పడుతుంది.

రుద్రాణిని పట్టించుకోకుండా డాక్టర్‌తో కావ్య అబార్షన్ గురించి మాట్లాడుతాడు రాజ్. కానీ, డాక్టర్ ఒప్పుకోదు. తల్లికి తెలియకుండా అబార్షన్ చేయడం క్రైమ్ అంటూ వాదిస్తుంది డాక్టర్. ఇంతలో రిపోర్ట్స్ వచ్చాయని నర్స్ వచ్చి చెబుతుంది. దాంతో కావ్య బెడ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్స్ చూస్తుంది డాక్టర్. రిపోర్ట్స్ చూసిన డాక్టర్ బయటకు వచ్చి అందరికి గుడ్ న్యూస్ అని సంతోషంగా చెబుతుంది.

మీరు కావ్య గారి ప్రాణాలు పోతాయని భయపడేగా అబార్షన్ చేయిద్దామనుకుంటున్నారు. ఇక ఆ అవసరం లేదు. కావ్య...