భారతదేశం, నవంబర్ 23 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్ పెడుతున్న కొత్త కంపెనీ గురించి అక్కడికి వెళ్లి ఆరాలు తీస్తాడు రాహుల్. అక్కడ మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత స్వరాజ్ గ్రూప్ నుంచి భారీ మొత్తంలో గోల్డ్, డబ్బు తరలిస్తున్నారు. వీటిని ఏ లెక్కల్లో చూపించలేదు. బాగా దొరికావ్ రాజ్ నేనేంటో చూపిస్తా అని అనుకుంటాడు రాహుల్.

మరోవైపు అపర్ణ, సుభాష్ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. రాహుల్ కోపంగా రావడం చూసి రుద్రాణి అడుగుతుంది. కానీ, తల్లి రుద్రాణిపైనే చిరాకు పడతాడు రాహుల్. అదంతా పైనుంచి స్వప్న చూస్తుంది. రాహుల్ కోపంగా ఉంటే స్వప్న వెళ్లి ఏమైందని అడుగుతుంది.

రాజ్ పెడుతున్న కొత్త కంపెనీ గురించి స్వప్నకు రాహుల్ చెబుతాడు. గోల్డ్, డబ్బు కొత్త కంపెనీకి తరలిస్తున్నారని, అడిగితే నన్నే తప్పు పడతావా అని రాజ్ కోప్పడతాడేమో అని, సరైనా ఆధా...