Hyderabad, ఆగస్టు 24 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్‌కు యామిని మందు అలవాటు చేస్తుంది. నీ బాధ పోడానికి ఇదే సరైన మందు అని చెబుతుంది. దాంతో మందుకు బానిస అవుతాడు రాజ్. పీకల్లోతు తాగి రోడ్డుపై అందరితో గొడవ పెట్టుకుంటాడు.

అక్కడే చెప్పులను దిండు చేసుకుని రాజ్ పడుకుంటాడు. అటుగా కారులో వెళ్తున్న కావ్య రోడ్డు మీద ఎవరో పడుకున్నారని, బుద్ధి చెప్పాలనుకుంటుంది. కానీ, అది రాజ్ అని తెలిసి షాక్ అవుతాడు. నన్నెందుకు ఇంత మోసం చేశారని కావ్య నిలదీసి అలాగే, అక్కడ రోడ్డుమీదే పడుకుంటాడు.

దాంతో రాజ్‌ను కావ్య కారులో తీసుకెళ్తుంది. భర్తని ఒడిలో కూర్చెబెట్టుకుని ఇంటికి తీసుకెళ్తుంది కావ్య. ఇంటికి రాజ్‌ను తీసుకురావడం చూసి ఇంట్లోవాళ్లంతా షాక్ అవుతారు. ఏమైందని అడుగుతారు. దాంతో రాజ్ చేసింది, తాగింది అంతా కావ్య చెబుతుంది. అపర్ణ, సుభాష్ ఇద్దరు కుమ...