Hyderabad, ఆగస్టు 31 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్ ఇంటికి వస్తాడు. అంతా సంతోషంగా ఉంటారు. అందరితో రాజ్ సరదాగా పంచ్‌లు వేస్తూ నవ్వించడం చూసి కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోతుంది కావ్య. అది చూసిన రాజ్ ఏమైందని అడుగుతాడు. కావ్య నరకం అనుభవించింది, కట్టుకున్న వాడే అవమానిస్తే ఎలా ఉంటుంది అని ధాన్యలక్ష్మీ నోరు జారుతుంది.

దాంతో గుచ్చి గుచ్చి అడుగుతాడు రాజ్. కొడుకు అలా అడిగేసరికి అపర్ణ జరిగింది అంతా చెబుతుంది. రామ్‌లా రాజ్ మారింది, యామిని చేసిన కుట్రలు అంతా చెప్పేస్తుంది అపర్ణ. దాంతో కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్. నాకు ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో తెలియట్లేదు అని రాజ్ అంటాడు. ఇంతలో కావ్య వెంటనే వచ్చి రాజ్‌ను ప్రేమగా హత్తుకుంటుంది.

కొద్దిసేపు ఇద్దరు అలాగే ఉండిపోతారు. అన్ని రోజులు తాను పడిన నరకవేదన గురించి భర్తకు చెబుతుంది కావ్య...