భారతదేశం, జనవరి 25 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో మంత్రి ఇంటికి వెళ్లి నిలదీసిన డాక్టర్ చక్రవర్తి తలపై కొట్టి బంధిస్తాడు ధర్మేంద్ర. చంపకుండా, నిజం బయటపడకుండా ఉండేందుకు చక్రవర్తిని కిడ్నాప్ చేస్తాడు మంత్రి. ఇకనుంచి హాస్పిటల్‌కు చక్రవర్తి రాడని హెడ్ నర్స్ నీలవేణికి కాల్ చేసి చెబుతాడు ధర్మేంద్ర.

హాస్పిటల్‌లో ఏ విషయం జరిగినా తనకు సమాచారం అందించాలని నర్సుతో మంత్రి ధర్మేంద్ర అంటాడు. దానికి నర్స్ సరేనంటుంది. మరోవైపు కావ్య వాళ్లను పిలవడంతో లేడి డాక్టర్ అనురాధ దగ్గరికి వెళ్తారు. కావ్య ఎలా ఉన్నారు. ఇప్పుడు కుదుటపడ్డారా అని అనురాధ అడుగుతుంది. కానీ, కావ్య మాత్రం సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా ఉంటుంది.

పాప రిపోర్ట్స్ చూడమని రాజ్ కోరడంతో అనురాధ చూస్తుంది. పాప రిపోర్ట్స్ చూసిన డాక్టర్ అనురాధ షాక్ అవుతుంది. అసలు పాపకు ఎందుకు అలా అయిందని...