Hyderabad, అక్టోబర్ 5 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో భర్త రాజ్ కంటే పుట్టబోయే బిడ్డే ఎక్కువని కావ్య గట్టిగా చెప్పేస్తుంది. కావాల్సి వస్తే మీకు దూరంగా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను అని కావ్య చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. తర్వాత అదంతా డ్రామా అని అపర్ణకు చెబుతుంది కావ్య.

రాజ్ ప్రవర్తనకు, ఇంటి గౌరవం పోతుందనే బాధతో సుభాష్‌కు గుండెపోటు వస్తుంది. గుండె పట్టుకుని కుప్పకూలిపోతే అపర్ణ వచ్చి ట్యాబ్లెట్ ఇచ్చి కాపాడుతుంది. తర్వాత కావ్యకు అబార్షన్‌కు సంబంధించిన అసలు నిజం చెప్పాలని అప్పు అనుకుంటుంది. అందుకు కావ్యను కలుస్తుంది. విడాకుల గురించి మాట్లాడాలని అప్పు అంటుంది.

విడాకులు తీసుకుంటానన్న భయంతో వచ్చినట్లుంది. కానీ, ఇప్పుడు దీనికి నిజం చెబితే ఇది వెళ్లి కవిగారికి చెబుతుంది. కవిగారు ఆయనకు చెబుతారు. ఇది నాలోనే దాచుకోవడం కర...