Hyderabad, ఏప్రిల్ 27 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో దుగ్గిరాల ఇంటికి రామ్‌గా ఉన్న రాజ్ వస్తాడు. రాజ్‌కు కొన్నిజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఏదో తెలిసిన ఇల్లులా అనిపిస్తుందని, నేరుగా ఇక్కడికి వచ్చానేంటీ అని అనుకున్న రాజ్ గేట్ తీసి లోపలికి వస్తుంటాడు. అది చూసిన కావ్య అప్పుకు చెబుతుంది. అప్పు ఏం చేయకపోవడంతో అపర్ణకు చెబుతుంది.

రాజ్‌ను చూసిన అపర్ణ షాక్ అవుతుంది. అందరిని లోపలిని తీసుకెళ్లమని కావ్య చెప్పడంతో ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవిని ఏమార్చి అపర్ణ తన గదిలోకి తీసుకెళ్తుంది. బావ కేసు విషయం గురించి చెప్పాలని రుద్రాణి, రాహుల్, స్వప్నను అప్పు తీసుకెళ్తుంది. హాల్లో ఉన్న రాజ్ ఫొటోలు అన్ని తీసి పక్కకు పెడుతుంది కావ్య. డోర్ తెరిచి రాజ్‌కు స్వాగతం పలుకుతుంది కావ్య.

ఇక్కడికి ఎలా రాగలిగారు అని కావ్య అడిగితే.. నాకు తెలియకుండానే నా చేతుల...