Hyderabad, అక్టోబర్ 12 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో అత్తింటికి వెళ్లి రాజ్ భార్య కావ్యను ఇంటికి రమ్మంటాడు. మీరు తీసుకున్న నిర్ణయమైన మార్చుకోండి, లేదా దానికి గల కారణం ఏంటో అయిన చెప్పండి అని కావ్య డిమాండ్ చేస్తుంది. అందులో ఏది ఒప్పుకోని రాజ్ కావ్యను తీసుకెళ్లకుండానే ఇంటికి వెళ్లిపోతాడు.

రాజ్‌తో దురుసుగా మాట్లాడిన కావ్యను కనకం మందలిస్తుంది. అల్లుడితో ఏంటే అలా మాట్లాడతావ్. అసలు ఏం జరిగిందని అడుగుతుంది. కానీ, కావ్య ఏం చెప్పదు. ఏం జరిగిందో తెలుసుకుందామని అప్పుకు కనకం కాల్ చేస్తే పడుకుని ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో స్వప్నకు కాల్ చేస్తుంది రుద్రాణి. కానీ, స్వప్న ఉండదు.

అక్కడ రుద్రాణి ఉంటుంది. కనకం ఫోన్ చేయడం చూసి రుద్రాణినే లిఫ్ట్ చేస్తుంది. కూతురు పుట్టింటికి రావడంతో ఏం జరిగిందో తెలుసుకుందామని కాల్ చేస్తుందని రుద్రా...