Hyderabad, జూన్ 22 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో యామినికి రాజ్ తాళి కడుతుండగా పోలీసులు వస్తారు. కళావతిని చంపించడానికి ప్రయత్నించినందుకు యామినిని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతారు. కావ్యతో రాజ్ సన్నిహితంగా ఉంటుండాని, నీకు అడ్డుగా ఉన్నాడనే అక్కసుతో కావ్యను చంపించడానికి ప్రయత్నించావని అప్పు చెబుతుంది.

కావ్యను చంపించడానికి రఘు అనే కిల్లర్‌కు కోటి రూపాయలు సుపారీ ఇచ్చినట్లు అప్పు చెబుతుంది. కానీ, కిల్లర్ రఘు మాత్రం తనకు యామిని ఎవరో తెలియదని, అప్పుడే మొదటిసారి చూస్తున్నట్లు ప్లేట్ ఫిరాయించేస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. కోటి రూపాయలు ఇచ్చిన వీడియో ఉందని అప్పు చెప్పి ఫోన్‌లో చూస్తుంది. కానీ, ఆ వీడియో కూడా మాయం అయి ఉంటుంది.

కల్యాణ్, అప్పు పడుకున్నప్పుడు వాళ్ల గదిలోకి వెళ్లిన రాహుల్ దొంగచాటుగా ఆ ఫోన్ అప్పు వేలి ముద్రలత...