భారతదేశం, నవంబర్ 7 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కుయిలి నిజ స్వరూపాన్ని రాజ్, కావ్య బయటపెడతారు. ఇప్పటికైనా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకుంటే మంచిది. ఇంటికొస్తే నీకే బెటర్ అని చెప్పిన రాజ్, కావ్య వెళ్లిపోతారు. వాళ్లతోపాటు గోల్డ్ బాబు కూడా వచ్చేస్తాడు. మొత్తానికి రాహుల్‌కు క్లారిటీ వచ్చిందని, నాటకం సక్సెస్ అయిందని ముగ్గురు సంబరపడతారు.

వాళ్ల మాటలను కుయిలి భర్త రంజిత్ వింటుంటాడు. రాజ్, కావ్య గెటప్‌లు తీసేస్తారు. రాత్రంతా కుయిలి పక్కన పడుకున్నాని రాహుల్ అనుకున్నాడు. వాడి పక్కనే పడుకున్న అని తెలిస్తే ఏమైపోతాడో అని గోల్డ్ బాబు అంటాడు. కుయిలి మళ్లీ ఏదైనా మాన్యుపులేట్ చేస్తుందేమో అని కావ్య అనుమానిస్తుంది. కుయిలి దగ్గర డబ్బు లేదని నిరూపించాం కదా రాహుల్ చస్తే ఉండడు. డబ్బు లేదని తెలిస్తే చాలు ఏ బందాన్ని అయినా పక్కన పడేస్తాడు అని రాజ్ అంట...