భారతదేశం, నవంబర్ 6 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కుయిలి పార్టీ అరెంజ్ చేస్తుంది. గోల్డ్ బాబు, కుయిలి నాటీ అంటూ మాట్లాడుకుంటారు. పార్టీ సెటప్ అంతా బాగుంది. కానీ, ఒక్కటే తక్కువైంది. పార్టనర్. పార్టనర్ లేకుండా పార్టీ ఎలా ఎంజాయ్ చేసేది అని గోల్డ్ బాబు అంటాడు. దాంతో నేను ఉన్నాగా అని రాహుల్ ముందే గోల్డ్ బాబుతో డ్యాన్స్ చేస్తుంది కుయిలి.

గోల్డ్ బాబుతో కుయిలి డ్యాన్స్ చేయడం రాహుల్‌కు నచ్చదు. విసుక్కుంటాడు. రాజ్, కావ్య మరింత ఎక్కిస్తారు. కుయిలి చూడటానికి గోల్డ్ బాబు గర్ల్‌ఫ్రెండ్‌లా ఉందని, రాహుల్ పానకంలో పుడకంలా ఉన్నాడని అంటారు. దాంతో కోపంతా గోల్డ్ బాబును పక్కన పెట్టి కుయిలితో రాహుల్ బలవంతంగా డ్యాన్స్ చేస్తాడు. చిరాకు పడతూనే కుయిలి డ్యాన్స్ చేస్తుంది.

గోల్డ్ బాబు డోస్ పెంచి నాకు ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గింది, నేను వెళ్లిపోతానంటూ గొడ...