భారతదేశం, నవంబర్ 5 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 870వ ఎపిసోడ్ లో రాహుల్ కళ్లు తెరిపించే ప్రయత్నంలో రాజ్, కావ్య సక్సెస్ సాధించడానికి దగ్గరవుతారు. అలా జరగకుండా ఉండటానికి రుద్రాణి వేసిన ప్లాన్ బెడిసి కొడుతుంది. రాజ్ ను, దుగ్గిరాల ఫ్యామిలీ బిజినెస్ ను కావ్య మరోసారి కాపాడుతుంది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (నవంబర్ 5) ఎపిసోడ్ రాజ్ కు ప్రకాష్ ఫోన్ చేసి డిజైన్ ఫైల్స్ మిస్ అయిన విషయం చెప్పడంతో మొదలవుతుంది. అవి సమయానికి అందకపోతే రూ.50 కోట్ల నష్టం వస్తుందని ఇంట్లో వాళ్లందరూ టెన్షన్ పడుతుంటారు. దీంతో వెంటనే రాజ్ ను రమ్మని రుద్రాణి ఒత్తిడి తెస్తుంది. అదే విషయం చెప్పడానికి ప్రకాష్ ఫోన్ చేయడంతో రాజ్ కూడా టెన్షన్ పడతాడు. అక్కడి నుంచి వెళ్లాల్సిందే అని అనుకుంటాడు. అది విన్న రుద్రాణి తెగ మురిసిపోతుంది.

రాజ్ వస్తున్నాడా అని పదే పదే రుద్రాణి అడుగుతూ ఉంటు...