భారతదేశం, నవంబర్ 4 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 869వ ఎపిసోడ్ లో రాజ్, కావ్య మారువేషాల్లో రాహుల్ కళ్లు తెరిపించే ప్రయత్నం చూడొచ్చు. అటు వాళ్లను ఆ ఇంట్లో నుంచి వెనక్కి తీసుకురావడానికి రుద్రాణి కొత్త ప్లాన్ వేస్తుంది. దీంతో కంపెనీకి కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 4) ఎపిసోడ్ కుయిలీని మంగతాయారు రూపంలో ఉన్న కావ్య టార్చర్ పెట్టే సీన్ తో మొదలవుతుంది. ఆమెతో ఇంట్లో అన్ని పనులు చేయిస్తుంది కావ్య. పదేపదే కొడుతూ, తిడుతూ ఉంటుంది. అటు రాహుల్ తో లింగరాజుగా మాట్లాడుతూ రాజ్ కూడా ఆడుకుంటాడు. గోల్డ్ బాబు వస్తున్నాడని, నీ కుయిలీ నిజ స్వరూపం ఏంటో తెలుస్తుందని రాహుల్ తో చెబుతాడు రాజ్. ఆ తర్వాత దుబాయ్ నుంచి వచ్చినట్లుగా గోల్డ్ బాబు వస్తాడు.

రాహుల్ కు అన్నయ్యను అంటూ గోల్డ్ బాబు వస్తాడు. ...