భారతదేశం, నవంబర్ 3 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కుయిలి ఇంట్లో భోజనానికి కావ్య, రాజ్ కూర్చొంటారు. వడ్డించడానికి పనివాళ్లు లేరా అని కావ్య అడిగితే.. కుయిలి, రంజిత్ షాక్ అవుతారు. ఇంటి సీక్రెట్స్ బయట వాళ్లకు చెబుతున్నారని, తీసేసామని రంజిత్ కవర్ చేస్తాడు. కుయిలినే కావ్య, రాజ్‌కి వడ్డిస్తుంది.

అది తిన్న కావ్య, రాజ్ ఊంచేసి అస్సలు బాగాలేదని, కాకా హోటల్ నుంచి తీసుకొచ్చారా అని, ఇలాంటి దానితో ఎలా ఉంటావురా అని డ్రామా చేస్తారు. వాళ్లకు భయపడి రాహుల్ కూడా అస్సలు వంట బాగోలేదని అంటాడు. దాంతో మీకోసం పెద్ద హోటల్ నుంచి తెప్పిస్తామని కుయిలి అంటాడు. ఇంకా పెద్ద హోటలా అని రంజిత్ భయపడతాడు.

అంటే లోపల అంత డొల్లేనా అని రాజ్ అంటాడు. ఫైవ్ స్టార్ హోటలేగా తెప్పించేద్దాం అని రంజిత్ అంటాడు. ఇలా రోజు హోటల్ ఫుడ్ నుంచి తెప్పించి మా మనవడిని ఏం చేద్దామనుకుంటున్నార...