భారతదేశం, నవంబర్ 27 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కల్యాణ్‌ను అప్పు కారులో రాత్రి తీసుకెళ్తుంది. నాకు నరకం చూపిస్తున్నట్లు ఉందని కల్యాణ్ అంటాడు. ఐస్‌క్రీమ్ తినాలని ఉందని అప్పు అంటుంది. ఇదివరకు ఇలాగే తిని అమ్మతో తిట్లు తినిపించావ్ అని కల్యాణ్ అంటాడు.

నువ్వెందుకు తీరుస్తావులే. అదే మా బావ అయితే బకెట్ లిస్ట్ పూర్తి చేశాడు. నీకు నా మీద మోజు తీరిపోయింది అని అప్పు అంటుంది. సరే ఆపు. తినిపిస్తా. కానీ చిన్నది అని కల్యాణ్ అంటాడు. అప్పు ఐస్‌క్రీమ్ తింటుంది. అక్కడే అప్పు వాళ్ల పోలీస్ స్టేషన్ ఉంటుంది. అలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తానని వెళ్తుంది అప్పు. అక్కడ ఒకావిడ పాప కోసం ఏడుస్తుంటుంది.

కానిస్టేబుల్ తిడుతుంటాడు. అప్పుడే వచ్చిన అప్పు కానిస్టేబుల్‌ను తిడుతుంది. శాంతంగా విని సాయం చేయాలని కానీ అలా అరిస్తే ఎలా అని బుద్ధి చెబుతుంది అప్పు. అస...