భారతదేశం, నవంబర్ 26 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 888వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాహుల్ కు కొత్త కంపెనీ పెట్టించడంపై సీతారామయ్య మందలించడం, రుద్రాణిని ధాన్యలక్ష్మి దెప్పిపొడవడం, బుల్లెట్ బండిపై రాజ్, కావ్య రొమాన్స్ లాంటి సీన్లతో సాగిపోయింది. మొత్తంగా ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (నవంబర్ 26) ఎపిసోడ్ రాజ్, కావ్యలకు స్వప్న, రాజ్ థ్యాంక్స్ చెప్పే సీన్ తో మొదలవుతుంది. గొడవ సద్దుమణగడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అయితే ఆ తర్వాత సీతారామయ్య.. రాజ్, కావ్య చేసిన పనికి వాళ్లకు క్లాస్ పీకుతాడు. మీరు చేసిన పని వల్ల ఈ కుటుంబం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఏం జరిగినా తాను అందరూ స్వరాజ్ కంపెనీ చెట్టు నీడనే ఉండాలని అనుకున్నానని, మీ నాన్న, బాబాయ్ అదే చేశారని రాజ్ తో అంటాడు సీతారామయ్య.

తాము కూడా కుటుంబం విచ్ఛిన్నం కావద్దనే రా...