భారతదేశం, నవంబర్ 25 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 887వ ఎపిసోడ్ లో ఆర్ పేరు మీద కంపెనీ ఏంటి? ఎందుకు అనే విషయాలను ఇంట్లో వాళ్లందరికీ చెబుతారు రాజ్, కావ్య. దీంతో స్వప్న కాస్త వెనక్కి తగ్గుతుంది. కానీ రాహుల్, రుద్రాణి బుద్ధి మారకపోగా.. మరో కుట్రకు తెరతీస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 25) ఎపిసోడ్ రాజ్ ఫోన్ ను స్వప్న తీసుకొని రాహుల్ దగ్గరికి రావడంతో మొదలవుతుంది. అందులో ఆర్ పేరుతో కొత్త కంపెనీ మొదలుపెట్టబోతున్నారని, స్వరాజ్ కంపెనీ నుంచి కేజీల కొద్దీ బంగారం, డబ్బు తెలియకుండానే ట్రాన్స్‌ఫర్ చేశారని స్వప్నతో చెబుతాడు రాహుల్.

దీంతో ఇప్పుడే నిలదీద్దాం పదా అని స్వప్న అంటుంది. కానీ వద్దని రాహుల్ వారిస్తాడు. అయినా వినకుండా స్వప్న వెళ్తుంది. తనకూ అదే కావాలని రాహుల్ అనుకుంటాడు.

కింద అందరూ అపర్ణ, సుభాష్ పెళ్లి...