భారతదేశం, నవంబర్ 24 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో సుభాష్, అపర్ణల 30వ రోజు పెళ్లి రోజు జరిపిస్తారు దుగ్గిరాల ఇంటి సభ్యులు. అపర్ణ, సుభాష్‌ల బరువు గురించి కామెడీగా మాట్లాడుకుంటారు. అపర్ణను ఎలా చూసుకుంటారో మగ పెళ్లి వారి తరఫున రాజ్ చాలా గొప్పగా చెబుతాడు. కానీ, అదంతా కావ్య గురించి చెబుతున్నట్లు ఉంటుంది.

సుభాష్‌ను ఎలా చూసుకుంటారో చెప్పమని అడిగితే కావ్య చెబుతుంది. కావ్య కూడా రాజ్ గురించి చెబుతుంది. తర్వాత సుభాష్, అపర్ణలు దండలు మార్చుకుంటారు. అంతా గిఫ్ట్స్ ఇస్తారు. కావ్య మాత్రం అపర్ణ చిన్నప్పటి ఫొటోలన్నింటిని ఆల్బమ్‌గా చేసి ఇస్తుంది. అందులో అపర్ణ చిన్ననాటి ఫొటోలు ఉంటాయి. అవి చూసి అపర్ణ చాలా ఎమోషనల్ అవుతుంది.

కన్నీళ్లు పెట్టుకుంటుంది అపర్ణ. నేను నా ఫొటోల కోసం ఎంతో ట్రై చేశాను. కానీ, కుదర్లేదు. నువ్వు తీసుకొచ్చావ్ అని కావ్యను మెచ్చుకుం...