భారతదేశం, నవంబర్ 22 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇప్పటివరకు కంపెనీ లోగోనే డిజైన్ కాలేదు. మీరు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అని ఫోన్‌లో రాజ్ మాట్లాడుతుంటే వచ్చి కావ్య వింటుంది. ఇప్పటివరకు స్వరాజ్ గ్రూప్‌కు చేయలేని విధంగా డిజైన్స్, ఆఫీస్ అట్మాస్పియర్ భిన్నంగా ఉండాలంటున్నారు. దానికి టైమ్ పడుతుందని అవతలి వ్యక్తి అంటాడు.

స్వరాజ్ గ్రూప్ కంపెనీకి సంబంధించిన ఒక్కటి కూడా ఉండకూడదు. ఆ కంపెనీ ఈ కంపెనీ వేరు అన్నట్లుగా ఉండాలి అని రాజ్ చెబుతాడు. కొత్త కంపెనీ మేనేజరా అని కావ్య అంటే అవును అని రాజ్ అంటాడు. నాకు భయంగా ఉందండి. తాతయ్య గారు ఈ కంపెనీ సృష్టించారు. ఇది కాకుండా మీరు వేరే కంపెనీ పెడితే బాధపడతారేమో అని కావ్య అంటుంది.

ఇదంతా ఎందుకు చేస్తున్నామో తెలుసు కదా. మనసుకు నచ్చిందే చేస్తున్నాం. కంపెనీ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యేవరకు ఇంట్లో ఎవరికి ...