భారతదేశం, నవంబర్ 21 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో సుభాష్, అపర్ణ పెళ్లి చూపులు జరుగుతుంటాయి. రుద్రాణి అన్నదానికి అపర్ణ లేచి నడిచి చూపిస్తుంది. మేము అడిగినవి కూడా అబ్బాయి చేయాలి అని ధాన్యలక్ష్మీ, కావ్య అంటారు. దాంతో సుభాష్ చాలా గొప్పోడు అన్నట్లుగా కావ్య, ప్రకాశం మాట్లాడుతారు.

సుభాష్ ఒంట్లో షుగర్, ఫ్యాట్ ఉందని ప్రకాశం అంటాడు. అబ్బాయి పేషంట్‌ అయిన డీసెంట్‌గా ఉన్నాడు, నచ్చాడు అని అపర్ణ అంటుంది. అనాధిగా పెళ్లి చూపుల్లో అమ్మాయిలనే ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు అని కావ్య అడిగితే దాని వెనుక ఉన్న కారణాన్ని ఇందిరాదేవి గొప్పగా చెబుతుంది. అందరూ చప్పట్లు కొడతారు. అంతా పొగుడుతారు.

ఇంతలో స్వప్న వచ్చి అంతా వెలిగిపోతుంది. చాలా బాగుంది అని స్వప్న అంటుంది. ఇప్పుడు ఏమైందని అంత ఉక్రోషంగా మాట్లాడుతున్నావ్ అని సుభాష్ అంటాడు. మీరే మారారని అంటున్నాను. అం...