భారతదేశం, నవంబర్ 20 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాహుల్ ఆఫీస్‌కు వెళ్తాడు. కానీ, అక్కడ అన్ని ఫైల్స్ రాజ్ ముందే చూసి ఉంటాడు. కేవలం రాహుల్‌ను మాత్రం సైన్ చేయమని శ్రుతి చెబుతుంది. అంటే నేను ఏ ఫైల్ చూడాల్సిన అవసరం లేదా అని రాహుల్ అంటాడు.

లేదు సర్, అరగంట క్రితమే రాజ్ సర్ అన్ని ఫైల్స్ చూశారు. మీరు కేవలం సంతకం చేస్తే చాలంటుంది. దాంతో రాహుల్ సైన్ చేస్తాడు. అది చూసి శ్రుతి నవ్వుతుంది. మీది కేవలం పేపర్ వెయిట్ పోస్ట్ అని తెలియక పొంగిపోయాడనుకుంటుంది శ్రుతి. ఈ మాత్రం దానికి అంతా బిల్డప్ ఎందుకు. ఎలాంటి పవర్స్ లేని ఈ పనికిరాని కుర్చీ నాకు ఎందుకు అనుకుంటాడు రాహుల్.

తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్లి డిజైన్స్‌లో కరెక్షన్స్ చెప్పానుగా ఏమైంది అని రాహుల్ అడుగుతాడు. కావ్య మేడమ్ మొత్తం చూసి ఎలాంటి కరెక్షన్స్ అవసరం లేదు. క్లైంట్స్‌కు అలాగే నచ్చాయని చె...