భారతదేశం, నవంబర్ 19 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 882వ ఎపిసోడ్ లో రాహుల్ నటనకు పూర్తిగా అతని బుట్టలో పడిపోయిన రాజ్, కావ్య అతనికి తాత్కాలికంగా ఎండీ బాధ్యతలు అప్పగిస్తారు. అతడు ఆ హోదాలో ఆఫీసుకు వెళ్లగా.. ఇటు దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, సుభాష్ పెళ్లి రోజు సందడి పెళ్లి చూపుల ఘట్టంతో మొదలవుతుంది.

బ్రహ్మముడి బుధవారం (నవంబర్ 19) ఎపిసోడ్ రాహుల్ కు రాజ్, కావ్య కంపెనీ తాత్కాలిక ఎండీ బాధ్యతలు అప్పగించే సీన్ తో మొదలవుతుంది. అది చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ తింటారు. తనకు వద్దంటూనే రాహుల్ ఆ ఆఫర్ అంగీకరిస్తాడు.

రాజ్ తీసుకున్న నిర్ణయాన్ని ఇంట్లో వాళ్లు ఎవరూ వ్యతిరేకించరు. అయితే ఈ నమ్మకం కావ్యది అని, ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకూడదని రాహుల్ కు రాజ్ స్పష్టంగా చెబుతాడు. తాను రేయింబవళ్లు కష్టపడి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రాహుల్ అంటాడు.

ఆ ఆఫర్ లెటర్ పట్టుకొ...