భారతదేశం, నవంబర్ 18 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 881వ ఎపిసోడ్ లో రాహుల్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొడతాడు. దీంతో రాజ్ సహా ఇంట్లో వాళ్లందరూ అతని బుట్టలో పడిపోతారు. రుద్రాణి ఈ నాటకానికి మరింత ఆజ్యం పోస్తుంది. కావ్య కూడా అతనికి మద్దతుగా నిలవడంతో ఇక రాహుల్ కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడానికి రాజ్ సిద్ధమవుతాడు.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 18) ఎపిసోడ్ రాహుల్ గురించి స్వప్న ఎమోషనలై ఇంట్లో వాళ్లకు క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. రాహుల్ ఆ డబ్బు కోసం తన ప్రాణాలకు తెగిస్తే మీరందరూ అతన్ని అవమానించారని, అసలు ఇప్పటికీ అతన్ని నమ్మడం లేదని స్వప్న అందరినీ నిందిస్తుంది.

అటు రుద్రాణి ఆమెకు జత కలుస్తుంది. వాడు నా కొడుకు అయిన నేరానికి ఇంత దారుణంగా అవమానించాలా అని వాళ్లను నిలదీస్తుంది. దీంతో రాహుల్ రంగంలోకి దిగి వాళ్లు అలా అవమానించడంలో తప్పు లే...