భారతదేశం, నవంబర్ 17 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నాసిరకం చీర కట్టావేంటీ. అస్సలు బాగోలేదని ధాన్యలక్ష్మీ అంటుంది. నాకు బాగుంది. ఈ చీర రాహుల్ నాకు తెచ్చిన చీర అని స్వప్న చెబుతుంది. నా భర్త తన కష్టార్జితంతో తెచ్చిన చీర. అందుకే కట్టుకున్నా అని స్వప్న అంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి వేరే చీర కట్టుకోమని చెబుతాడు.

ఎవరు ఏం చెప్పిన వినను. చీర మార్చుకోను. నిన్ను డిసప్పాయింట్ చేయను అని స్వప్న అంటుంది. ఇంతలో రాజ్ వచ్చి ఈరోజు 11 గంటలకు టెండర్ ఉంది. అక్కడ 20 లక్షల డిపాజిట్ కట్టాలి. నువ్ టైమ్‌కు బ్యాంక్‌కు వెళ్లి క్యాష్ విత్ డ్రా చేసుకుని టైమ్‌కు టెండర్ ఆఫీస్‌కు వెళ్లు అని చెక్ ఇస్తాడు రాజ్. రాహుల్ డౌట్ పడుతుంటే ముందు ఈ ఆఫీస్ పనులు చూడు అని రాజ్ అంటాడు.

దానికి రాహుల్ ఎందుకు అని డౌట్ పడతారు. వాడే చేయాలి అని రాజ్ గట్టిగా చెబుతాడు. థ్యాంక్స్ చెబుత...