భారతదేశం, నవంబర్ 15 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యను రాజ్ క్యాండిల్ లైట్ డిన్నర్‌కు తీసుకెళ్తాడు. నన్ను అడక్కుండా నాకు ఇష్టమైంది తెలుసుకుని ఆర్డర్ తీసుకోవాలని కావ్య అంటుంది. ఇస్తాను అని బేరర్‌ను పిలిచి తనకు నచ్చింది ఆర్డర్ చేస్తాడు రాజ్. అవి మీకు నచ్చినవి అని చెప్పి రాజ్‌కు నచ్చిన మరో లిస్ట్ ఆర్డర్ చేస్తుంది.

మా శ్రీవారి ఇష్టాలే నా ఇష్టాలు అని కావ్య అంటుంది. కళావతి రోజుకో విధంగా నన్ను పడగొడుతున్నావ్ అని రాజ్ అంటే.. ఏంటీ పబ్లిక్‌లోనే ఫ్లర్ట్ చేస్తున్నావని కావ్య అంటుంది. పబ్లిక్‌లోనే రొమాన్స్ థ్రిల్లింగ్‌గా ఉంటుందని రాజ్ అంటాడు. బేరర్‌ను వాటర్ బాటిల్ తీసుకురమ్మని రాజ్ చెబితే రాహుల్ వస్తాడు. రాహుల్‌ను బేరర్‌గా చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

రాజ్, కావ్యలకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాడు రాహుల్. నా భార్యా బిడ్డలను పోషించుకోడాన...