భారతదేశం, నవంబర్ 14 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ ప్రేమలేఖను కావ్య, సుభాష్ లవ్ లెటర్‌ను అపర్ణ చదువుతారు. వీరిద్దరి కంటే మా ఆయన బాగా రాశారు అని ధాన్యలక్ష్మీ చెబుతుంది. ధాన్యలక్ష్మీ చదువుతుంది. మంచి కవిత్వంతో ప్రేమలేఖలా ఉంటుంది. కానీ, చివరిలో ధాన్యలక్ష్మీ పేరుకు బదులు లత.. లత.. లత అని ఉంటుంది.

దాంతో లత ఎవరు అని ప్రకాశంను అంతా అడుగుతారు. ఇంత రాసింది ధాన్యం గురించి కాదన్నమాట అని అపర్ణ అంటుంది. ఎవత్తదీ అంటూ చీపురు కట్టతో ప్రకాశంను బాదుతుంది. అదెప్పుడో చిన్నప్పుడు కథే అని ప్రకాశం అంటే.. చిన్నప్పుడు అంత కథ నడిపారా అని మరింత బాదుతుంది ధాన్యం.

మరోవైపు రాహుల్ పని చేసేందుకు వెళ్తున్నట్లు రుద్రాణితో చెబుతాడు. నా కష్టార్జితంతో స్వప్నను పోషిస్తున్నట్లు చూపించాలి. మోసం చేసిన నిజాయితో చేయాలి. అందుకే నిజంగానే పనిచేస్తాను. కొడితో కుంభస్థల...