భారతదేశం, నవంబర్ 12 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 876వ ఎపిసోడ్ చాలా సరదాగా సాగిపోయింది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం సంతోషంగా కనిపిస్తుంది. అయితే ఇంటి కోడలు చేసిన పనికి మామలకు కొత్త కష్టం వస్తుంది. అటు పూర్తిగా మారిపోయిన రాహుల్ ను మరోసారి రుద్రాణి మార్చడానికి ప్రయత్నించగా.. స్వప్న ఆమెకు గట్టి వార్నింగ్ ఇస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్ కిచెన్ లో కావ్య కోసం రాజ్ చేసే చికెన్ మంచూరియాతో మొదలవుతుంది. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా ఇంట్లో వాళ్లు పట్టుకుంటారు. కన్నతల్లికి తలనొప్పి ఉందంటే తల తిప్పుకొని వెళ్తావు.. నాన్నమ్మను నేను నాకు నడుము నొప్పిగా ఉందంటే పట్టించుకోవు.. ఆఫీసు పని అంటే బిజీ అంటావు..

కానీ నీ భార్యకు మాత్రం చికెన్ మంచూరియా, అది కూడా అర్ధరాత్రి చేసి పెడతావా అంటూ అపర్ణ, ఇందిరాదేవి, ప్రకాశం, ధాన్యలక్ష్మి.. రాజ్‌తో ...