భారతదేశం, నవంబర్ 11 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇంటికొచ్చిన రాహుల్‌ను అంతా నానా మాటలు అంటారు. మారమని చెబుతారు. ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టను . నువ్వు పడ్డ బాధను పోగొట్టలేను. నేను మారి చూపించడం తప్పా ఏం చేయలేను. ఈ క్షణమే నేను మారి చూపించాలనుకుంటున్నాను. ఇంకొక్క ఛాన్స్ ఇవ్వు అని స్వప్నను రాహుల్ అడుగుతాడు.

రాశులు పోసి చూపించేది కాదు నమ్మకం అంటే. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలంటే కలగాల్సింది నమ్మకం. అది మాటలతో కాదు చేతలతో చూపించు అని వెళ్లిపోతుంది స్వప్న. తర్వాత రాహుల్ వెళ్లి ఏడుస్తుంటాడు. వెళ్లి రుద్రాణి మాట్లాడుతుంది. నువ్వేం తప్పు చేశావని ఏడుస్తున్నావంటుంది. నేను చేసిన తప్పులు పెరిగి పెరిగి బారంగా మారాయి అందుకే ఏడుపొస్తుందని రాహుల్ అంటాడు.

నువ్వు తప్పు చేయలేదు. తప్పు చేసింది. ఇంట్లోవాళ్లు. నిన్ను ప్రూవ్ చేసుకునేందుకు ఇంట్లోవాళ్...