భారతదేశం, నవంబర్ 10 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పోలీస్ స్టేషన్‌లో ఉన్న రాహుల్ దగ్గరికి రుద్రాణి, స్వప్న వెళ్తారు. స్వప్న చీదరించుకుంటే నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్ము అని రాహుల్ అంటాడు. భార్య చెప్పింది విన్నావా, నీ తల్లి మాటే నమ్మి ఇక్కడికి తెచ్చుకున్నావ్ అని స్వప్న అంటుంది.

నువ్వు చెప్పింది నిజమే. నేను తప్పులు చేశాను. కానీ, నేను హత్య చేసింది నేను కాదని నువ్వు నమ్మితే చాలు. దాన్ని డబ్బు వెనుక పడింది నిజమే. కానీ, దాన్ని ప్రేమించలేదు. అలాంటి దాన్ని నేనెందుకు చంపుతాను. అలా చేస్తే నాకేగా సమస్య. రాజ్, మావయ్యకు చెప్పి విడిపించండి అని రాహుల్ అంటాడు.

రేయ్ నువ్వు ఎవరి కాళ్లు పట్టుకోవట్లేదు. ఎంత ఖర్చు అయినా సరే నిన్ను బయటకు తీసుకొస్తాను అని రుద్రాణి అంటుంది. ఇది నీ తల్లి మానసిక స్థితి. అడ్డదారిలో వెళ్లి నిన్ను కాపాడుతానంటుంది. ఇక మ...