భారతదేశం, డిసెంబర్ 9 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 899వ ఎపిసోడ్ లో కేరళలో రాజ్, కావ్య, చోటు, మోటు చుట్టూ తిరగగా.. ఇటు ఇంట్లో స్వప్నను రాహుల్ పూర్తిగా తన బుట్టలో వేసుకోవడం చూడొచ్చు. అయితే రాజ్, కావ్య కిడ్నాప్ కావడం, పోలీసుల చేతికి పెన్ డ్రైవ్ చిక్కడంతో ఈ సీరియల్ కొత్త మలుపు తిరిగింది.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (డిసెంబర్ 9) ఎపిసోడ్ రాజ్, కావ్య రెస్టారెంట్ కు వెళ్లే సీన్ తో మొదలవుతుంది. అక్కడ ఇద్దరూ రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. వాళ్లను చూసిన పక్కనున్న వాళ్లు మీరు లవర్సా? హనీమూన్ కు వచ్చారాలాంటి ప్రశ్నలు అడగడంతో రాజ్ మరింత రెచ్చిపోయి కావ్యతో రొమాంటిక్ గా మాట్లాడుతుంటాడు. ఆ ఇద్దరి వెంట పెన్ డ్రైవ్ కోసం పడుతున్న చోటు, మోటు అక్కడికి వస్తారు. వాళ్లిద్దరినీ రెస్టారెంట్ లో చూడటంతో వాళ్ల గదిలో పెన్ డ్రైవ్ కోసం వెతకడానికి వెళ్తారు.

రాజ్, కావ్య గద...