భారతదేశం, డిసెంబర్ 8 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆశ్రమంలో మరోసారి కావ్యను చెక్ చేస్తాడు గురూజీ. ఆయుర్వేదం అందిస్తారు. రాజ్ అక్కడ ఎదురుచూస్తుంటాడు. ఆ ఆశ్రమానికి చోటు, మోటు వస్తారు. రాజ్‌ దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. నీ దగ్గర ఉంది నాకు కావాల్సింది ఇవ్వాలి అని మోటు అంటాడు. సరే అని మోటు చెంప పగులగొడుతాడు రాజ్.

ఒకదాని కోసం వచ్చినప్పుడు ఇవన్నీ తప్పవని మోటు అంటాడు. చచ్చినవాడి అన్నకు ఏం ఇచ్చావని మోటు అడిగితే.. వీడే తెలియదు వాడెలా తెలుస్తుంది. నేను ఏం ఇస్తాను అని రాజ్ అంటాడు. ఇంతలో పెన్‌డ్రైవ్ ఉందా నీ దగ్గర అని చోటు నోరు జారుతాడు. పెన్‌డ్రైవా.. అదేంటీ. అలాంటిదేది నా దగ్గర లేదని రాజ్ అంటాడు.

పెన్‌డ్రైవ్ ఇస్తావా లేదా అని పదే పదే మోటు అడిగితే.. మరోటి చెంపపై కొడతాడు రాజ్. దాంతో మోటు, చోటు వెళ్లిపోతారు. అప్పుడే వచ్చిన కావ్య వాళ్లను చూస్త...