భారతదేశం, డిసెంబర్ 4 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో వారం రోజుల్లో నీకు పూర్తిగా నయం అయ్యాకే ఇంట్లో అడుగుపెట్టాలని కావ్యతో రాజ్ అంటాడు. వారం రోజుల్లో కేసు పూర్తి చేసి అత్త కోరుకున్న కోడలిగా ఇంట్లోనే ఉంటాను అప్పు అంటుంది. వారం రోజుల్లో మీ జీవితాలన్నీ పూర్తిగా నాశనం చేస్తాను అని రాహుల్ అనుకుంటాడు.

మరోవైపు తన కూతురును చూసిన ప్లేసును అప్పుకు రేణుక చూపిస్తుంది. రేణుక భర్త వచ్చి మళ్లీ అలాగే మీకు చెప్పిందా. రోజు రోజుకు తన సమస్య ఎక్కువ అవుతుంది. ఇల్యూజనేషన్ ఎక్కువ అవుతుంది. మళ్లీ మీరు వచ్చి ఆశలు రేపుతున్నారు అని రేణుక భర్త అంటాడు. నిజ నిజాలు నేను తేలుస్తాను. మీరు రేణుకను లోపలికి తీసుకెళ్లండని అప్పు అంటుంది.

ఇంటి పక్కన ఉన్న ఒక ఆవిడను అడిగితే పాప చనిపోయిందని, ఆమె మాత్రం బతికే ఉందని చెబుతుందని చెబుతుంది. చుట్టు పక్కల వాళ్లను అడిగితే అదే చ...