భారతదేశం, డిసెంబర్ 31 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ మనసులో, కళ్లలో, ఒళ్లంతా కావ్య అని నాకు తెలుసు. కానీ, ఆయన్ను ఏడిపించడానికి నాకు టైమ్ దొరికింది. అందుకే కాస్తా ఏడిపిస్తున్నా అని కావ్య అంటుంది. ఎంతటీ ఖిలాడీవే నువ్వు అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు సాండీ దగ్గర నుంచి స్మగ్‌ల్డ్ గోల్డ్ తీసుకుంటాడు రాహుల్.

అది రాజ్ కారులో పెట్టగలిగితే ఆట రసవత్తరంగా ఉంటుంది అని రాహుల్ అనుకుంటాడు. మరోవైపు కావ్యను అన్నం తినమని రాజ్ బతిమిలాడుతాడు. అన్నం తిని కషాయం తాగాలి అని రాజ్ అంటే మాకు పాస్తాలు తెప్పించండి అని కావ్య ఏడిపిస్తుంది. ఆ మాటలు రేఖ వింటుంది. ఇంకోసారి అవన్నీ జరగవు. నువ్వు తిట్టు కొట్టు కానీ అన్నం తినకుంటే నా మీద ఒట్టు అని రాజ్ అంటాడు.

దాంతో కావ్య అన్నం తింటుంది. అది చూసి అసూయ పడుతుంది రేఖ. మరోవైపు రాత్రి దొంగ బంగారం ఉన్న బ్రీఫ్ కేస్...