భారతదేశం, డిసెంబర్ 30 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ బావను నాకు ఇచ్చి పెళ్లి చేసుంటే నాకు ఈ గతి పట్టేదా. నీవల్లే నా జీవితం ఇప్పుడు ఇలా తగలబడింది అని రేఖ అరిచి వెళ్లిపోతుంది. తర్వాత రేఖ మందు తాగుతుంటే రాహుల్ తిడుతుంటాడు. రాజ్ వచ్చి ఎందుకు తిడుతున్నావని అడుగుతాడు.

ఫారెన్‌లో ఒకడిని ప్రేమించి బ్రేకప్ చేసుకుని వచ్చింది. చూడు ఎలా తాగుతుందో అని రాహుల్ అంటాడు. అది చూసి షాక్ అవుతాడు రాజ్. రాహుల్ తిడుతుంటే రేఖతో నేను మాట్లాడుతాను. నువ్వెళ్లు అని రాహుల్‌ను పంపిస్తాడు. రేఖకు మూవ్ ఆన్ అవ్వమని నచ్చజెపుతాడు రాజ్. నీలా నాకు ఇంట్లో ఎవరు చెప్పట్లేదు అని రేఖ అంటుంది. ఇంట్లో అందరికి నీ మీద కన్సర్న్ ఉంది. నా సపోర్ట్ నీకుంటుంది. ఈ చెత్త నుంచి బయటకి రా అని రాజ్ చెబుతాడు.

అదంతా ఈజీ కాదు బావ. కానీ, ట్రై చేస్తాను అని రేఖ అంటుంది. మరుసటి రోజు ఉదయం ...