భారతదేశం, డిసెంబర్ 3 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పాప మిస్సింగ్ ఫైల్ కేస్ స్టడీ చేస్తుంది అప్పు. పాప పోస్ట్‌మార్టమ్ గురించి కానిస్టేబుల్‌ను అడుగుతుంది అప్పు. అతను ఫొటో తీసి పంపిస్తానని చెబుతాడు. ఇంతలో కల్యాణ్ వచ్చి ఇలా లేట్ నైట్ పని చేస్తే ఎలా అని అంటాడు.

ఇంతలో ప్రకాశం వచ్చి ప్రొడ్యూసర్ నీకు కాల్ చేస్తే కలవట్లేదని నాకు కాల్ చేశాడు. వెంటనే కాల్ చేయు. అయినా పోలీస్, ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. ఈ ఫైల్స్ ఏంటీ అని అడుగుతాడు. దాంతో కల్యాణ్, అప్పు ఇద్దరు కంగారుపడతారు. ఇంతలో పాలు తీసుకొచ్చిన ధాన్యలక్ష్మీ కూడా ఈ ఫైల్స్ ఏంటనీ అడుగుతుంది.

ఇదంతా నా సినిమా స్టోరీ కోసం. అందుకే ఈ ఫైల్స్ అన్ని స్టడీ చేస్తున్నా. దానికి అప్పు హెల్ప్ చేస్తుంది అని కల్యాణ్ చెబుతాడు. స్టోరీ ఏంట్రా అని ప్రకాశం అడిగితే.. అప్పు స్టోరీనే చెబుతాడు కల్యాణ్. ఇంట్లో వాళ్ల...