భారతదేశం, డిసెంబర్ 29 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 916వ ఎపిసోడ్ కథను పూర్తిగా ఓ కొత్త మలుపు తిప్పింది. కావ్య జీవితంలో రాబోయే కొత్త గండం రుద్రాణి కూతురు రేఖ అని తేలింది. రాజ్, కావ్య జీవితాలు రేఖ రాకతో ఎలా మారబోతున్నాయన్న ఉత్కంఠను ఈ ఎపిసోడ్ రేకెత్తించింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (డిసెంబర్ 29) ఎపిసోడ్ దొంగ బంగారం అంటూ వెళ్లిన సాండీని రాజ్ తిట్టి పంపించే సీన్ తో మొదలైంది. ఆ తర్వాత రాహుల్ కు శాండీ ఫోన్ చేస్తాడు. జరిగిన విషయం చెబుతాడు. నీ దొంగ బంగారం మొత్తం నేను కొంటాను.. కానీ నువ్వు రాజ్ దగ్గరికి వెళ్లిన సీసీటీవీ విజువల్స్ నాకు కావాలి.. దాని ద్వారా రాజ్ ను ఇరికిస్తానని రాహుల్ అంటాడు. ఇంత బిజినెస్ ఇస్తున్న నీకోసం జైలుకెళ్లడానికైనా రెడీ అని సాండీ చెబుతాడు. అప్పుడే స్వప్న వచ్చి పాపను రెడీ చేయమని చెప్పి వెళ్తు...