భారతదేశం, డిసెంబర్ 27 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 915వ ఎపిసోడ్ లో దుగ్గిరాల కుటుంబానికి ఓ కొత్త ముప్పు రాబోతున్నట్లు చూపించడం ఆసక్తి రేపుతోంది. కావ్యకు పీడకల రావడం, హారతి ఆరిపోవడం, అటు రాజ్ ను దొంగ బంగారంతో ఇరికించాలని రాహుల్ ప్లాన్ చేయడం, చివరికి ఓ కొత్త పాత్ర ఎంట్రీ మరింత ఆసక్తి రేపుతోంది.

బ్రహ్మముడి సీరియల్ శనివారం (డిసెంబర్ 27) ఎపిసోడ్ కావ్యకు ఓ పీడకల రావడంతో మొదలవుతుంది. దుగ్గిరాల వారి ఇల్లు మంటల్లో తగలబడిపోతున్నట్లు కావ్య కలగంటుంది. దీంతో ఆమె ఉలిక్కి పడి లేస్తుంది. రాజ్ కూడా ఆందోళన పడతాడు. తనకు వచ్చిన కల గురించి చెప్పడంతో దానిని పీడకల అంటారని, లైట్ తీసుకోమని రాజ్ అంటాడు. ఏదో ఆలోచిస్తూ పడుకోవడం వల్ల మన మెదడు అలాంటివి క్రియేట్ చేస్తుందని అతడు చెప్పినా కావ్య మాత్రం ఆందోళన చెందుతూ ఉంటుంది.

ఇటు రాహుల్ ఓటమి భారంతో కుమిలిపోతుంటాడు. ...