భారతదేశం, డిసెంబర్ 26 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 914వ ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇంట్లో మళ్లీ సంతోషం వెల్లివిరుస్తుంది. అయితే అది చూసిన ఓర్వలేని రాహుల్, రుద్రాణి మరో కుట్రకు సిద్ధమవుతారు. దొంగ బంగారంతో రాజ్, కావ్యలను దెబ్బ కొట్టాలని రాహుల్ భావిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 26) ఎపిసోడ్ అప్పు విషయంలో ధాన్యలక్ష్మి వెనక్కి తగ్గే సీన్ తో మొదలవుతుంది. అందరూ అప్పును ఓదారుస్తుండగా అక్కడికి ధాన్యం వచ్చి తాను చేసిన తప్పు తెలుసుకున్నానని, నిన్ను వేధించి తాను ఏం సాధిస్తానని అంటుంది.

నీకు నచ్చిన ఉద్యోగం చేసుకో.. కాకపోతే బిడ్డ పుట్టిన తర్వాతే అని చెబుతుంది. ఇది విని అప్పు సంతోషిస్తుంది. ఇంట్లో వాళ్లందరు కూడా ఓ సమస్య తీరిపోయిందనుకుంటారు. బిజినెస్ లోనూ అదే జరిగితే బాగుంటుందని సుభాష్ అంటాడు.

ఆ తర్వాత కావ్య,...