భారతదేశం, డిసెంబర్ 25 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 913వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అప్పు విషయంలో మొదట వెనక్కి తగ్గని ధాన్యం తర్వాత దిగి వస్తుంది. అటు రాహుల్ కు క్లైంట్స్ షాకిచ్చి మళ్లీ రాజ్ దగ్గరికి వస్తారు. నెల రోజుల్లోనే స్వరాజ్ గ్రూప్ మళ్లీ నంబర్ వన్ గా నిలుస్తుంది. దీంతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం సంతోషంలో గంతులేస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ గురువారం (డిసెంబర్ 25) ఎపిసోడ్ ధాన్యలక్ష్మికి ఇందిరా దేవి క్లాస్ పీకే సీన్ తో మొదలువుతుంది. నువ్వు నీ కోడలు ఎలా మాట వినాలని అనుకుంటున్నావో తాను కూడా నువ్వు అలాగే వినాలని అనుకుంటున్నట్లు ఇందిరా దేవి అంటుంది. దీంతో ధాన్యం ఎదురు తిరుగుతుంది. ఇన్నేళ్లూ ఎప్పుడూ మీ మాట జవదాటలేదని, ఇప్పుడు కూడా మీకు ఇష్టం లేని అన్నదానం చేయనని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో అందరూ షాక్ తింటారు. ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో ర...