భారతదేశం, డిసెంబర్ 23 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఒకావిడను రౌడీలు తరుముతుంటే అప్పు దగ్గరికి వెళ్తుంది. పోలీసులను చూసి రౌడీలు పారిపోతారు. మెడలై చైన్ లాక్కున్నారు. ఇంకా నా వెంట పడ్డారు అని ఆమె చెబుతుంది. చైన్ స్నాచర్స్‌ను పట్టుకోమని కానిస్టేబుల్స్‌కు అప్పు చెబుతుంది. వాళ్లు మళ్లీ వస్తారేమో అని ఆవిడ భయపడితే నేను డ్రాప్ చేస్తానని అప్పు చెబుతుంది.

దాంతో ఆవిడ ఇంటికి అప్పు వెళ్తుంది. ఇల్లు బాగా రిచ్‌గా ఉంటుంది. ఇంట్లో అశోక్‌ ఫొటోను చూసి అప్పు షాక్ అవుతుంది. అశోక్ గురించి ఆవిడను అడుగుతుంది అప్పు. అశోక్ నా భర్త. నాకు ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యాడు. నా మొదటి భర్త పోయిన తర్వాత నేను, నా కూతురు పింకీ ఒంటరివాళ్లం అయ్యాం. అప్పుడే అశోక్ మాకు అండగా నిలుచుని నన్ను ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడ. ఈ ఇల్లు కూడా ఆయనే కొన్నాడు అని ఆవిడ చెబుతుంది....