భారతదేశం, డిసెంబర్ 22 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఫేక్ డైరెక్టర్ మణి వర్మ యాడ్ షూట్ చేస్తూ హడావిడి చేస్తాడు. ఇంతలో కిచెన్‌లో నుంచి వాసన రావడంతో ఎవరో ఇక్కడ పరాటలు చెడగొడుతున్నారని కిచెన్‌లోకి వెళ్లిపోతాడు మణి వర్మ. పరాటలు ఎవరైనా ఇలా చేస్తారా, పిండి ఇలా కలుపుతారా అని పని మనిషిపై అరిచి తానే పరాటాలు చేస్తాడు.

ఇంతలో రాజ్ వచ్చి డైరెక్టర్ గురించి అడిగితే.. కిచెన్‌లో ఉన్నాడని చూపిస్తారు. మణి వర్మ పరాటలు చేస్తూ కనిపిస్తాడు. ఇంతకీ అతను డైరెక్టరేనా అని కావ్య అడిగితే.. కాదు పరాట మాస్టర్ అని ప్రకాశం అంటాడు. ఇప్పుడు నిరూపిస్తానని కిచెన్‌లోకి పరాట రేట్ అడుగుతాడు. మణి వర్మ చెబుతాడు. దాంతో మణి వర్మను లాక్కొచ్చి నేను చెప్పాను కదా అంటాడు ప్రకాశం.

మరి డైరెక్టర్‌గా ఇక్కడికి ఎందుకు వచ్చావురా, ఎవరు పంపించారని నిలదీస్తాడు రాజ్. రాహుల్ చెప్పొద్దని ...