భారతదేశం, డిసెంబర్ 2 -- బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు అంటే 893వ ఎపిసోడ్ లో రాజ్, కావ్యకు పెద్ద ఊరట కలిగించే కేరళ వైద్యం గురించి తెలుస్తుంది. దీంతో కావ్యను బతికించుకోవచ్చని రాజ్ సంబరపడిపోగా.. అదే సమయంలో స్వరాజ్ కంపెనీని దెబ్బ తీయడానికి రాహుల్ ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (డిసెంబర్ 2) ఎపిసోడ్ గుడిలో రాజ్, కావ్య ఒకరినొకరు టీజ్ చేసుకోవడంతో మొదలవుతుంది. పంతులుగారు తనను గుర్తు పట్టకపోవడంతో రాజ్ కాస్త ఉడుక్కుంటాడు. దీంతో కావ్య అతన్ని మరింత టీజ్ చేస్తుంది.

ఆ తర్వాత గుడిలో కూర్చొందామని ఇద్దరూ వెళ్తుండగా.. కావ్యకు కళ్లు తిరుగుతాయి. కింద పడిపోతుండగా రాజ్ ఆమెను పట్టుకుంటాడు. వెంటనే హాస్పిటల్ కు వెళ్దామని రాజ్ అనడంతో.. ఇలా అప్పుడప్పుడూ జరుగుతుందని డాక్టర్ ముందే చెప్పిందిగా అని కావ్య అంటుంది.

అందుకే బిడ్డ వద్...