భారతదేశం, డిసెంబర్ 19 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య మోడ్రన్ డ్రెస్సులో ఉన్న ఫొటోను డీపీగా పెట్టుకుని, ఫ్యామిలీ అందరికి చూపిస్తానంటాడు రాజ్. దాంతో వద్దని ఫోన్ తీసుకునేందుకు కావ్య ట్రై చేస్తుంది. తర్వాత రాజ్‌ను గట్టిగా సోఫాలో పడేసి ముద్దులు పెట్టినట్లు చేసి మురిసిపెడుతుంది కావ్య. తర్వాత కాసేపటికి భయపడిన రాజ్ ఫోన్ ఇస్తాడు.

అందులో మోడ్రన్ డ్రెస్ తీసేసి ట్రెడిషనల్‌గా తన ఫొటో పెడుతుంది కావ్య. అది చూసిన రాజ్ కావ్యనే మోడల్‌గా పెట్టి యాడ్ షూట్ చేస్తే అయిపోతుందిగా. ఇంకెవరో మోడల్ ఎందుకు అని రాజ్ అనుకుంటాడు. అదే విషయం కావ్యకు చెబుతాడు రాజ్. కావ్య ఒప్పుకోదు. నువ్వు తప్ప నాకు ఇంకో గతి లేదని రాజ్ అంటాడు. అయినా కావ్య ఒప్పుకోదు. ఎలాగైనా ఒప్పిస్తా. నువ్వే నా మోడల్ అని అనుకుంటాడు రాజ్.

మరోవైపు రేణుక, అశోక్‌లను అప్పు ఇన్వేస్టిగేట్ చేస్తుంద...