భారతదేశం, డిసెంబర్ 18 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ ఆఫీస్‌లో రాహుల్‌కు అమ్ముడుపోయిన వ్యక్తిని రాజ్, కావ్య పట్టుకుంటారు. నిన్ను పట్టుకోవాలనే డిజైన్స్ వేసినట్లు అబద్ధం చెప్పాను. చాలా నిరాశపడినట్లున్నావ్ అని కావ్య అంటుంది. అతన్ని రాజ్ కొట్టి పోలీసులకు అప్పజెబుతాడు. తర్వాత కొద్దిసేపు సస్పెన్స్‌లో పెట్టిన దొంగను పట్టుకోవడంలో నన్ను మించిపోయావ్ అని రాజ్ అంటాడు.

మరోవైపు పోలీస్ స్టేషన్‌కు రేణుక భర్త అశోక్ వెళ్తే అప్పు మీకు గుడ్ న్యూస్ అంటుంది. కేసు క్లోజ్ చేస్తున్నారా అని అశోక్ అడిగితే.. కాదు మీ పాప బతికే ఉందని అప్పు చెబుతుంది. దానికి అశోక్ షాక్ అవుతాడు. పోస్ట్‌మార్టమ్‌తో మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు. మీకు దొరికిన డెడ్ బాడీ మీ పాపకు కాదు అని అప్పు చెప్పేసరికి అశోక్ తెగ కంగారుపడిపోతాడు.

చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని అతి కష్టంగా అం...