భారతదేశం, డిసెంబర్ 17 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 906వ ఎపిసోడ్ లో కావ్య, స్వప్న కోసం రాహుల్ ను ఏమీ అనకుండా వదిలేస్తాడు రాజ్. అయితే దానిని అదునుగా తీసుకొని రాహుల్ తన అసలు ఆట మొదలుపెడతాడు. రాజ్ తన జువెలరీ యాడ్ కోసం తీసుకొచ్చిన మోడల్ ను ఎత్తుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (డిసెంబర్ 17) ఎపిసోడ్ రాహుల్ విషయంలో రాజ్ కు స్వప్న థ్యాంక్స్ చెప్పే సీన్ తో మొదలవుతుంది. ఆమె ఎమోషనల్ అవడం చూసి కావ్య కూడా ఈ విషయం ఇక్కడితో వదిలేయాలని రాజ్ తో అంటుంది. అతన్ని ఎలా ఎదుర్కోవాలో తర్వాత చూద్దామని చెబుతుంది.

ఇటు అప్పు రాత్రి అయిన తర్వాత మెల్లగా ఇంట్లోకి వస్తుంది. అయితే ప్రకాశం ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అతన్ని చూసిన అప్పు ఏవేవో సాకులు చెబుతుండగా.. కల్యాణ్ వచ్చి అతనికి మొత్తం తెలిసిపోయిందని అంటాడు. ఈ విషయం మీ అమ...